గాలె: భారత్-ఎ, శ్రీలంక-ఎ మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్ట్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 189/8 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అయితే శ్రీలంక ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 6.3 ఓవర్ల వద్ద వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ని కాసేపు నిలిపివేశారు అంపైర్లు. ఆ తర్వాత తిరిగి మ్యాచ్‌ని ప్రారంభించారు. శ్రీలంక 70/2 స్కోర్ వద్ద ఉన్న సమయంలో మ్యాచ్‌ని డ్రాగా ప్రకటించారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ (67) హై స్కోరర్‌గా నిలిచాడు.

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 452 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక టార్గెట్‌ని చేరుకోలేకపోయింది. 330 పరుగులకే ఆలౌట్ అయింది.