తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ పార్టీ టివికె సంచలనం సృస్టించింది. ఎవరూ ఊహించని విధంగా 110 స్థానాలకు పైగా టివికె ఆధిక్యంలో కొనసాగుతూ అధికారం దిశగా దూసుకుపోతోంది. దీంతో విజయ్ ఇంటివద్ద సంభరాలు అంబరానంటాయి. ఆయన నివాసానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. ఈక్రమంలో హీరోయిన్ త్రిష, విజయ్ ఇంటికి వెళ్లారు. టివికె విజయం సాధించడంతో త్రిష, విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నివాసంలో దాదాపు రెండు గంటలపాటు ఉన్న త్రిష.. తిరిగి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా త్రిష.. తెల్లవారుజామునే తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాగా, విజయ్-త్రిష ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు గతకొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. త్రిష కారణంగానే విజయ్ భార్య విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి.