నవతెలంగాణ – భువనగిరిధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో కొనుగోలు నత్తనడకన నడుస్తున్నాయని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి విమర్శించారు. గురువారం భువనగిరి పట్టణ పరిధిలోని హుస్సేనాబాద్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు దాన్యం వచ్చి 45 రోజులైనా కనీసం 50% కొనుగోలు కాలేదన్నారు. హమాలీల కొరత, వాహనాల కొరత తీవ్రంగా ఉందన్నారు. […]

The post ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం appeared first on Navatelangana.