
మన తెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్ల అం శంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రాష్ట్రంలో రికార్డ్ స్థా యిలో ధాన్యం దిగుబడి అయ్యిందని, దేశంలోనే రికార్డ్ స్థాయిలో దిగుబడి ,కొనుగోళ్లు జరిపింది రాష్ట్రంలోనే అని మంత్రి స్పష్టం చేశారు. ఈ రబీ సీజన్ లో 67 లక్షల ఎకరాలలో వరి సాగులో, 141 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రానుందని, 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్దమయ్యిందని, ఇప్పటి వరకు ప్రభుత్వం 17.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ. 2,310 కోట్లు చెల్లించినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాల అంశలో బిఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గతంలో లే ని విధంగా వసతులు కల్పించామని, అకాల వర్షాలు సంభవిస్తే ధాన్యం తడిసి పోకుండా ఉండేందుకు 2.63 లక్షల టార్పాలిన్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 18.75 కోట్ల గన్ని బ్యాగులు అందుబాటులో ఉం చామని, 64.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసే సామర్ధ్యం ఉందన్నారు. అదనంగా 11.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు గోదాముల గుర్తించినట్లు మంత్రి తెలియజేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు గా ను 6,200 వాహనాల ఏర్పాటు చేశామని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు దాహార్తి తీర్చేందుకు వీలుగా మం చినీటి సరఫరా, ఓఆర్‌ఎస్ సరఫరా ఏర్పాట్లు చేశామని మంత్రి చెప్పుకొచ్చారు. కొనుగోలు కేంద్రాలలో ఉద యం, సాయంత్రం కొనుగోలుకు ఆదేశాలు జారీ చేశామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి నోడల్ అధికారి పర్యవేక్షణ ఉంటుందని, అన్నింటికీ మించి ధాన్యం కొనుగోలు అంశంపై ప్రత్యేకించి పౌ ర సరఫరాల శాఖా కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూ మ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. తాలు పేరుతో కోత విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, తూకం అంటూ తగ్గిస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.
రైతులకు నష్టం కలిగించే ఏ చర్యను ప్రభుత్వం సమర్ధించదని మంత్రి పేర్కొన్నారు. అకాల వర్షాలు సంభవిస్తే రైతులు, సిబ్బంది చెట్లు కింద, కరెంట్ స్తంభాల దగ్గర ఉంటే పిడుగుపాటుకు గురి కాకుండా సూచనలు చేస్తున్నామని, వాతావరణంలో సంభవిస్తున్న మార్పులను ఎ ప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలకు సమాచారం అం దించేందుకు ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేసినట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించకుండా ప్రత్యేక టోకెన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో బిఆర్‌ఎస్ నేతల తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మడం లేదని, వరుసగా నాలుగు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా గుణపాఠం నేర్చుకోలేదని ధ్వజమెత్తారు.
రికార్డు స్థాయిలో కొనుగోళ్లు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ధాన్యం దిగుబడి, కొనుగో ళ్లు రికార్డ్ స్థాయిలో జరిగాయని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2024-25 ఖరీఫ్ లో 8,332 కేంద్రాలను ఏర్పాటు చేశామని తె లిపారు. 2023-24 బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఖ రీఫ్‌లో 47.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 10,415 కోట్లు చెల్లిస్తే, కాంగ్రెస్ ప్రభు త్వ హయాంలో 202425 ఖరీఫ్ లో 53.95 లక్షల మె ట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 12,512 కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలియజేశారు. 2024-25 రబీలో 8,378 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 10 లక్షల 87 వేల మంది రైతుల నుంచి 74.21 లక్షల మె ట్రిక్ టన్నుల
ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 17,198 కోట్లు రైతులకు చెల్లించినట్లు చెప్పారు.2025-26 ఖరీ ఫ్ 8,448 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 11లక్షల 65వేల మంది రైతుల నుండి 71.86 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.17,160 కోట్లు రై తులకు చెల్లించినట్లు మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుత రబీ లో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 13 లక్ష ల మంది రైతుల నుండి రికార్డ్ స్థాయిలో 90 లక్షల మె ట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు లక్ష్యాన్ని పెట్టుకుని రూ. 21,501 కోట్లు రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.










