
అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ 2026 ప్రారంభం కానుంది. జూలై 4 నుండి జూలై 6 వరకు ప్రైమ్ డే సేల్ జరుగుతుందని అమెజాన్ ప్రకటించింది. మూడు రోజుల పాటు జరిగే ఈ అమెజాన్ సేల్ ప్రత్యేకంగా ప్రైమ్ సభ్యుల కోసం మాత్రమే! ఈ సేల్ సమయంలో ప్రైమ్ సభ్యులు అన్ని ప్రధాన కేటగిరీలపై బంపర్ డిస్కౌంట్ల ప్రయోజనాన్ని పొందుతారు. ఆఫర్ల వివరాలు ఇంకా ప్రకటించినప్పటికీ సేల్ కు ముందు వెల్లడించనుంది. ఈ మూడు రోజుల సేల్ జూలై 4వ తేదీన అర్ధరాత్రి 12:00 గంటలకు ప్రారంభమై, జూలై 6వ తేదీ రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది. ఈ సేల్ సమయంలో వన్ ప్లస్, శాంసంగ్ బ్రాండ్లకు సంబంధించి ఏకంగా 500 ప్రొడక్ట్స్ పై భారీగా డిస్కౌంట్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. ప్రైమ్ సభ్యులు ఎస్బిఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల హోల్డర్లకు అదనంగా 10% తక్షణ తగ్గింపును పొందుతారు. ఇక అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే ఎంపిక చేసిన కొనుగోళ్లపై 5% క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అమెజాన్ తాత్కాలికంగా సభ్యత్వ ధరలను తగ్గించింది. కంపెనీ వార్షిక ప్రైమ్ సభ్యత్వం ఇప్పుడు రూ.1,499 బదులుగా రూ.999కే అందుబాటులో ఉంది. ఇక లైట్ సభ్యత్వం రూ.799 బదులుగా రూ.599కి, కేవలం షాపింగ్ డిస్కౌంట్ల కోసం అందించే ఎడిషన్ ప్లాన్ రూ.399 బదులుగా రూ.299కి అందుబాటులో ఉంటాయి.









