హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట, మణికొండ, పంజాగుట్ట, మెహదీపట్నం, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, మలక్‌పేట, బేగంపేట, సోమాజిగూడ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతాల్లో కూడా వర్షం దంచికొట్టింది.
భారీ వర్షంతో రహదారులు జలమయమై, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రధాన కూడళ్ల వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్యాలయాల నుంచి ఇంటికి బయలుదేరిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. వర్షం కారణంగా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.













