
న్యూఢిల్లీ : స్విస్ బ్యాంకులలో భారతదేశపు ధనం 2025లో గణనీయంగా 8 శాతానికి పైగా తగ్గింది. ఇప్పుడు ఇది 3.25 స్విస్ ఫ్రాంక్‌లు అంటే రూ 36,793 కోట్లకు పడిపోయింది. స్థానిక బ్యాంకుల బ్రాంచ్‌లు ,ఇతరత్రా ఆర్థిక సంస్థలలో భారతీయ నిధుల తగ్గుముఖం విషయం స్విస్ సెంట్రల్ బ్యాంక్ నుంచి గురువారం విడుదల అయిన వార్షిక గణాంకాల నివేదిక ద్వారా తెలిసింది. అయితే వ్యక్తులు, సంస్థల ద్వారా దాఖలు అయిన సొమ్ము ఈ ఏడాది ఏకంగా 50 శాతం పైగా పెరిగింది.
అంటే ఈ లెక్కలో ఇప్పుడు 524 మిలియన్ స్విస్ కరెన్సీ అంటే దాదాపు రూ 6000 కోట్లకు చేరిందని వివరాలతో స్పష్టం అయింది. స్విస్ బ్యాంకులలో మొత్తం మీద భారతీయ సొమ్ము మొత్తాల తగ్గుదల అంతకు ముందటి ఏడాది 2024లో కన్పించిన మూడింతల ఎదుగుదలతో పోలిస్తే కీలక అంశం అయింది. ఇప్పటి ఈ వార్షిక లెక్కల మేరకు విదేశీ బ్యాంకుల్లో నల్లధనం ఏ మేరకు ఉందనేది నిర్థారించడడం కుదరదని అధికార వర్గాలు తెలిపాయి.









