
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని అల్లు అర్జున్‌ని ఆదేశించింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను ఎ-11గా పోలీసులు చేర్చారు. ఎ1 నుంచి ఎ10 వరకూ నిందితులుగా సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 19 మందికి సమన్లు జారీ అయ్యాయి. వీరి వ్యక్తిగత హాజరు తర్వాత విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2024, డిసెంబర్ 4న పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమా రుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. థియేటర్‌కు వచ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు దూసుకురావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌ను కూడా బాధ్యున్ని చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశా రు. బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అరవింద్‌తో పాటు మూవీ టీం అండగా నిలిచింది. ఫ్యామిలీకి ఆర్థిక సాయం అందించడం సహా శ్రీతేజ్ వైద్యానికి సాయం అందించారు.













