లెజెండరీ ఇండియన్ యాక్టర్, నటకిరీటి పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్ న్యూజెర్సీలో అభిమానులను సందడి చేశారు. ఆయనతో ప్రత్యేకంగా మీట్ & గ్రీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి న్యూజెర్సీకి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కమ్యూనిటీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రవి పొట్లూరి, మహేంద్ర ముసుగు, సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ పురస్కారం లభించినందుకు అభినందనలు తెలిపారు. తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడారు.

అభిమానులతో ముచ్చటించిన రాజేంద్ర ప్రసాద్.. తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీంతో కార్యక్రమం సందడిగా సాగింది.