అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్‌లో భాగంగా యువత కోసం ప్రత్యేకంగా “ATA Youth Cruise” కార్యక్రమాన్ని ప్రకటించింది. “Sail. Connect. Celebrate.” అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ క్రూయిజ్ ఈవెంట్ జూలై 31న జరగనుంది.

16 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కార్యక్రమంలో స్నేహపూర్వక వాతావరణంలో పరిచయాలు పెంపొందించుకోవడం, వినోద కార్యక్రమాలు, సంగీతం, డ్యాన్స్‌తో పాటు ప్రత్యేక క్రూయిజ్ అనుభూతిని అందించనున్నారు. బాల్టిమోర్ హార్బర్‌లో బోటు ప్రయాణం నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి టికెట్ ధర 60 డాలర్లుగా నిర్ణయించారు. పాల్గొనేవారికి ఆహారం, పానీయాలు, డీజే మ్యూజిక్, డ్యాన్స్ ఫ్లోర్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

యూత్ కమిటీ ఛైర్‌గా అనూష రావు, కో-ఛైర్లుగా వరుణ్ చల్లా, సుజిత్ కొప్పుల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ATA ప్రతినిధులు కోరారు.

WhatsApp Image 2026-06-09 at 4.30.18 PM.jpeg