భారత రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరో చారిత్రక మైలురాయిని చేరుకోబోతున్నారు. జూన్ 10న ఆయన వరుసగా అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన నేతగా నిలవనున్నారు. దీంతో జవహర్‌లాల్ నెహ్రూ 4,398 రోజుల రికార్డును అధిగమిస్తారు.
అలాగే గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసిన సేవలను కలుపుకుని ఎన్నికైన ప్రభుత్వాధినేతగా మోదీ 9,000 రోజులకు పైగా పదవిలో కొనసాగిన నేతగా మరో ఘనత సాధించనున్నారు. ఈ ఏడాదితో ప్రజా జీవితంలో ఆయన 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారు.
ఇప్పటికే అత్యధిక కాలం సేవలందించిన కాంగ్రెస్ేతర ప్రధానమంత్రిగా, వరుసగా రెండు పూర్తి మెజారిటీ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన తొలి కాంగ్రెస్ేతర నేతగా మోదీ రికార్డులు సృష్టించారు. ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను పెంచడంలో ఆయన పాత్ర కీలకమని మద్దతుదారులు చెబుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు ఆయన ఖాతాలో చేరే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












