17 ఏళ్ల క్రితం ఉద్యోగాల నుంచి తొలగించబడిన 84 మంది కార్మికులకు కర్ణాటక హైకోర్టు కీలక ఉపశమనం కల్పించింది. కర్ణాటక మల్లాడి బయోటిక్స్ లిమిటెడ్ సంస్థ ప్రతి కార్మికుడికి రూ.3 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
2009లో కార్మికులను తొలగించే ముందు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని కోర్టు పేర్కొంది. సంస్థలో 100 మందికిపైగా ఉద్యోగులు ఉన్నప్పటికీ, తక్కువ మంది ఉన్నారని చూపించి నిబంధనలను ఉల్లంఘించిందని తేల్చింది.
సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్ట్ కార్మికులను కూడా ‘వర్క్‌మెన్’గానే పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగుల రికార్డులను దాచిపెట్టిన సంస్థపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.












