ఈపీఎఫ్ ఖాతాదారులు ఎదురుచూస్తున్న వడ్డీ జమలో ఆలస్యం జరిగినా ఎలాంటి నష్టం ఉండదని నిపుణులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్‌వో సిఫార్సు చేసింది. అయితే ఇంకా ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ కాలేదు. అయినప్పటికీ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే ఖాతాలో నెలవారీ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ లెక్కించి, తర్వాత ఒకేసారి జమ చేస్తారు. గత ఏడాది జూన్, జులై నెలల్లో వడ్డీ క్రెడిట్ కాగా, ఈసారి కూడా అదే సమయంలో జమయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం, ఖాతాల సయోధ్య, సభ్యుల వివరాల నవీకరణ వంటి ప్రక్రియల వల్ల జాప్యం జరుగుతోంది. వడ్డీ జమ వివరాలను ఈపీఎఫ్‌వో పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్‌లోని పాస్‌బుక్ ద్వారా సభ్యులు పరిశీలించవచ్చు.