ఢిల్లీ నగరం బర్డ్ డైవర్సిటీలో ప్రపంచ రాజధానులలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. Nairobi తర్వాత అత్యధిక పక్షి జాతులు ఉన్న రాజధానిగా ఢిల్లీ నిలిచిందని తొలి ఢిల్లీ బర్డ్ అట్లాస్ వెల్లడించింది. ఢిల్లీ అటవీ శాఖ, బర్డ్ కౌంట్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో మొత్తం 471 పక్షి జాతులు నమోదయ్యాయి. తొలి ఏడాది సర్వేలో 221 జాతులను గుర్తించగా, వాటిలో అంతరించిపోతున్న Black-bellied Ternతో పాటు ప్రమాదంలో ఉన్న Painted Stork వంటి జాతులు కూడా ఉన్నాయి.

అరవళ్లి కొండలు, యమునా వరద మైదానాలు మరియు సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే సమీపంలో ఉండటం వల్ల ఢిల్లీ వలస మరియు స్థానిక పక్షులకు ముఖ్యమైన ఆవాసంగా మారిందని నిపుణులు తెలిపారు. ఈ అట్లాస్ భవిష్యత్ పరిరక్షణ చర్యలకు కీలకంగా ఉపయోగపడనుంది.