ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ రఫేల్ యుద్ధ విమానాలను కోల్పోయిందంటూ పాకిస్థాన్ చేసిన ప్రచారానికి భారత వైమానిక దళం (IAF) తాజా చర్యతో చెక్ పడింది.

36 రఫేల్ యుద్ధ విమానాల నిర్వహణ కోసం ఐఏఎఫ్ కొత్త సపోర్ట్ కాంట్రాక్ట్ జారీ చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్, సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ సంస్థలకు ఐదు నెలల “బ్రిడ్జ్ సపోర్ట్” ప్యాకేజీ కోసం ప్రతిపాదనలు కోరింది.

ఈ ఒప్పందం ప్రకారం 36 రఫేల్ విమానాలన్నింటికీ నిర్వహణ, విడిభాగాలు, సాంకేతిక సహాయం అందించనున్నారు. 2016లో ఫ్రాన్స్‌తో కుదిరిన ఒప్పందం కింద కొనుగోలు చేసిన మొత్తం 36 విమానాలు ప్రస్తుతం సేవల్లో ఉన్నాయని ఈ RFP స్పష్టం చేస్తోంది.

ప్రతి విమానానికి ఏడాదికి 150 ఫ్లయింగ్ అవర్స్ చొప్పున, ఐదు నెలలకు మొత్తం 2,250 ఫ్లయింగ్ అవర్స్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదన రూపొందించారు. దీంతో ఆపరేషన్ సిందూర్‌లో రఫేల్ విమానాలు కోల్పోయినట్లు వచ్చిన ఆరోపణలు మరోసారి నిరాధారమని స్పష్టమవుతోంది.