
1656 వార్తలు

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ యాక్షన్ సినిమాలతో వెండితెరపై తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యా్క్ సినిమాలతో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోయిన్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను బాలకృష్ణతో చైల్డ్ ఆర్టిస్టుగా నటించానని.. తర్వాత హీరోయిన్ గా నటించానని వెల్లడించింది.

చేతికి సంకెళ్లు ఉన్నాయి.. చుట్టూ పోలీసుల పహారా ఉంది.. అయినా సరే ఆ కిలాడీ ఖైదీ ఉన్నట్లుండి మాయమైపోయింది.. హాస్పిటల్లో వైద్య పరీక్షల కోసం వచ్చి, పోలీసుల కళ్లుగప్పి పరారైన ఖైదీ త్రివేణి ఉదంతం సంచలనంగా మారింది. ఆసుపత్రి నుంచి విజయవాడకు.. అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్‌కు.. ఇలా తప్పించుక తిరిగిన లేడీ ఖైదీకి పోలీసులు చెక్ పెట్టారు.

పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో బెంగాల్లో రాజకీయ హీటెక్కింది. ఎన్నికల ప్రచారంలో TMC, BJP దూకుడు పెంచాయి. డూ ఆర్ డై అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం బెంగాల్‌ను చుట్టుముట్టింది. బీజేపీ అగ్రనాయకత్వమే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ పార్టీకి చెందిన సీఎంలు బెంగాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు.

స్టాక్ మార్కెట్లో రోజుకు రూ. 5-6 వేలు సంపాదించడానికి కనీసం రూ. 1 లక్ష పెట్టుబడి అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా ఇది సాధ్యమే, అయితే మార్కెట్‌పై సరైన అవగాహన, నాలెడ్జ్ ఉండాలి. రిస్క్ స్థాయిని బట్టి రిటర్న్స్ మారుతాయని..

భారత్ సెమీకండక్టర్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న అత్యాధునిక చిప్ సాంకేతికత ఇప్పుడు మన దేశంలోనే.. అది కూడా ఒడిశా గడ్డపై రూపుదిద్దుకోనుంది. భువనేశ్వర్‌లోని ఇన్ఫో వ్యాలీలో దేశంలోనే మొట్టమొదటి అధునాతన 3D చిప్ ప్యాకేజింగ్ యూనిట్‌కు శంకుస్థాపన జరిగింది.

Natural Cooling Remedy in Telugu: మండే ఎండల్లో ఇది అమృతం లాంటి ఔషధం అని చెప్పుకోవాలి. దీనిని తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్, మలబద్ధకాన్నిచిటికెలో పోగొట్టొచ్చు. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదర్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం ఎన్నో పాటలు యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నాయి. అటు ఫోక్ సాంగ్స్.. ఇటు సినిమా పాటలు దూసుకుపోతున్నాయి. కానీ కోట్లాది మంది శ్రోతల హృదయాలు గెలుచుకున్న పాటలు ఎవరు రాశారు.. ? ఎవరు మ్యూజిక్ అందించారు ? అనే విషయాలు మాత్రం చాలా మందికి తెలియవు. కొన్నేళ్ల క్రితం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన పాట... అనేక అవమానాల నుంచి పుట్టింది. ఇంతకీ ఆ పాట ఏంటో తెలుసుకుందామా.

Punjab Kings Owner Preity Zinta: పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా ప్రస్తుతం మ్యాచ్ లకు హాజరుకావడం లేదు. ఎప్పుడూ జట్టుతోపాటు ఉంటూ ప్రోత్సహిస్తూ కనిపించే ఈ లక్కీ లేడీ మ్యాచ్ లకు అసలు ఎందుకు హాజరు కావడం లేదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదయం పూట అలారం మోగుతున్నా కళ్ళు తెరవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. రాత్రంతా నిద్రపోయినా, తెల్లవారుజామున వచ్చే నిద్ర మాత్రం మరెంతో మధురంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది కేవలం బద్ధకం వల్ల మాత్రమే జరుగుతుందని అనుకుంటే పొరపాటే. దీని వెనుక మన శరీరంలోని జీవ గడియారం, హార్మోన్ల పనితీరు మెదడు ప్రత్యేక నిద్ర దశలు దాగి ఉన్నాయి. అసలు ఉదయం నిద్ర ఎందుకు అంత గాఢంగా ఉంటుంది.

తన సోదరుడు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పవన్ ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. త్వరగా కోలుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. మరోవైపు పవన్ ఆరోగ్య పరిస్థితిపై అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

భారతీయ వంటకాల్లో మీగడకు ప్రత్యేక స్థానం ఉంది. కొందరు టీ రుచి కోసం దీనిని వాడితే, మరికొందరు దీనిని నిల్వ చేసి స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకుంటారు. ప్యాకెట్ పాలలో మీగడ పల్చగా రావడం వల్ల చాలా మంది నిరాశ చెందుతుంటారు. అయితే పాలు వేడి చేసేటప్పుడు కొన్ని సాధారణ గృహ చిట్కాలను పాటిస్తే, మీగడ విడిపోకుండా ఒక మందపాటి పొరలా పైకి తేలుతుంది. కేవలం రెండు మూడు రోజులు నిల్వ చేసిన మీగడ నుండే దాదాపు అర కిలో నుండి కిలో వరకు నెయ్యిని తయారు చేసుకోవచ్చు.

ఖాళీగా ఉంటే ఏం చేస్తాం? సినిమా చూస్తాం లేదా కబుర్లు చెప్పుకుంటాం. కానీ ఈ నలుగురు మిత్రులు మాత్రం ఏకంగా ఉప్పు ప్యాకెట్‌ను విప్పి లెక్కపెట్టడం మొదలుపెట్టారు. ఒక రోజు కాదు.. ఏకంగా 9 రోజులు.. అసలు ఒక కిలో ఉప్పులో ఎన్ని గింజలు ఉంటాయో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మీరు రాత్రంతా నిద్రపోయినప్పటికీ ఉదయం అలసటగా, శక్తిహీనంగా అనిపిస్తుందా? ఇది సాధారణంగా అనిపించినా, మీ శరీరం మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నట్లు అర్థం. దీర్ఘకాలిక అలసటకు అనేక కారణాలు ఉన్నాయి, వీటిని అర్థం చేసుకోవడం మరియు పరిష్కరించడం చాలా ముఖ్యం. ప్రధాన కారణాలలో ఒకటి నిద్ర నాణ్యత. కేవలం ఏడెనిమిది గంటలు పడుకుంటే సరిపోదు.

భారత టీ20 జట్టు సారథ్య బాధ్యతల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయా..? ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ పగ్గాలు చేపట్టబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. ఐపీఎల్లో తిరుగులేని రికార్డు ఉన్న అయ్యర్ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపుతుండటంతో ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

Natural home remedies food: హాస్పిటల్స్ కి వేలు పెట్టే బదులు పెరట్లో ఫ్రీ గా దొరికే ఈ ఆకుతో పచ్చడి తింటే ఎంతో నయం. ఇంకా చెప్పాలంటే ఇది ఆరోగ్యకరమైనది కూడా. ఈ పచ్చడిని మీరు ఒకసారి వేడి అన్నంతో తింటే రోజూ చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది.

భారీ యాక్షన్ లేదా రొమాన్స్ లేకుండా వచ్చిన ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఒక స్టార్ హీరో.. ఐదుగురు హీరోయిన్స్ కలిసి నటించిన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ మూవీ కథ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందనే చెప్పాలి.

మంచిర్యాల జిల్లా గోదావరి తీరంలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. కవ్వాల్ అభయారణ్యం సమీపాన చెట్ల పొదల్లో పడి ఉన్న నాటు బాంబులు పేలి ఓ గేదె తీవ్రంగా గాయపడింది. అడవి పందుల వేట కోసం వేటగాళ్లు వీటిని దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. పశువులు, మనుషుల ప్రాణాలకు ప్రమాదకరమైన ఈ చర్యలను ఆపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా, చాలా చోట్ల సిలిండర్ల కొరత కూడా ఏర్పడింది. ఇలాంటి సమయంలో గ్యాస్ లేకుండానే వంట చేసుకునేందుకు వీలుగా మార్కెట్లోకి చిన్న చిన్న ఎలక్ట్రిక్ కుకింగ్ డివైజ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది గుడ్స్‌సిటీ మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ ట్రావెలింగ్ కుక్కర్. ఇది చూడటానికి ఎలక్ట్రిక్ టీ కెటిల్ లాగా అనిపించినప్పటికీ, ఇందులో అన్ని రకాల వంటు చేసుకోవచ్చు.

దోసె ఉదయం టిఫిన్‌గా తినడం వల్ల త్వరగా ఆకలి వేసి, అధిక క్యాలరీలు తీసుకుంటామని ఫిట్నెస్ ట్రైనర్ సిద్ధార్థ్ సింగ్ హెచ్చరిస్తున్నారు. దోసె రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, తగ్గించడం వల్లనే ఇలా జరుగుతుంది. దీన్ని నివారించడానికి, కడుపు నిండిన అనుభూతి కోసం మసాలా లేదా పనీర్ వంటి ఫిల్లింగ్స్‌తో దోసె తినాలని ఆయన సూచిస్తున్నారు.

ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా ఒక్కోసారి అలసట, నీరసం, నిస్సత్తువ ఆవరిస్తాయి. కానీ దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. దీనిని ఒక సాధారణ సమస్యగా భావించి విస్మరిస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు ఇలా చేయడం సరికాదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఏ కారణం లేకుండా అలసటగా అనిపించడానికి..

తెనాలిలో ఆన్లైన్ అశ్లీల కాల్స్, చాటింగ్ రాకెట్ బయటపడింది. “స్ట్రిప్ టాక్” పేరుతో పోర్టల్ నిర్వహిస్తూ డబ్బులు తీసుకుని మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇద్దరు మహిళలను విచారించగా… అసలు సూత్రధారి సాయి అనే యువకుడిగా తేలింది.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం తొండెపిలో దారుణ ఘటన జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించగా… ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

దేవర సినిమా హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం భారీగా ట్రెండ్ అవుతోంది. జాన్వీ, మహేష్, జక్కన్న వంటి స్టార్ల మద్దతు, దేవర పార్ట్ 2పై మేకర్స్ పెంచుతున్న హైప్, అలాగే వారణాసి షూట్‌తో పాటు తారక్ లుక్‌పై జాన్వీ కామెంట్ వంటివి ఈ సినిమాను వార్తల్లో నిలుపుతున్నాయి. పార్ట్ 2లో ఎన్టీఆర్ బీస్ట్ అవతార్ అంచనాలను మరింత పెంచుతోంది.