ఐపీఎల్‌ 2026లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో సొంత గడ్డపై ముంబైనుసన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తు చేసింది. 6 వికెట్ల తేడాతో ముంబైపై హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 243 పరుగులు చేయగా లక్ష్య చేధనలో బరిలోకి దిగిన హైదరాబాద్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.