అమెరికాలోని భారతీయ వృద్ధులకు ప్రత్యేక వేడుకకు రంగం సిద్ధమైంది. ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ -IANT ఆధ్వర్యంలో “సీనియర్ సిటిజన్స్ డే 2026” ఘనంగా నిర్వహించనున్నారు. మే 16వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డల్లాస్‌లోని భారత్యా నివాస్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.

వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ వేడుకలో నెట్‌వర్కింగ్, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, యోగా, మానసిక ఆరోగ్యంపై సూచనలు, ఎఫ్‌బీఐ ఆధ్వర్యంలో స్కామ్ అవేర్‌నెస్ సెషన్, బింగో, కరోకే వంటి వినోద కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి. అంతేకాదు, సీనియర్లు తమ అనుభవాలను పంచుకునే ప్రత్యేక సెషన్లు కూడా ఉండనున్నాయి.

పాటలు, డ్యాన్స్‌లు, సరదా కార్యక్రమాలతో పాటు హై టీ మరియు రుచికరమైన స్నాక్స్‌ను కూడా నిర్వాహకులు అందించనున్నారు. ముఖ్యంగా ఈ ఈవెంట్‌కు ప్రవేశం పూర్తిగా ఉచితం. పార్కింగ్ కూడా ఫ్రీగా ఉండటం విశేషం. కొత్త స్నేహాలు, ఆరోగ్య సూచనలు, వినోదం అన్ని ఒకే వేదికగా ఈ కార్యక్రమం నిలవనుంది.

WhatsApp Image 2026-05-13 at 9.13.26 PM.jpeg