మాతృ దినోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ — టాటా ఆఫ్ ఎన్‌సీ మహిళా విభాగం అద్భుతమైన వేడుకలకు శ్రీకారం చుట్టింది. తల్లుల కోసం వినూత్నమైన కార్యక్రమాలు, సరదా ఆటలు, క్రియేటివ్ యాక్టివిటీస్‌తో ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.


ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా “లైవ్ కుకింగ్ కాంపిటీషన్” నిలవబోతున్నది. మే 17 న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరిగే ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు తప్పనిసరిగా ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పరిమిత ఎంట్రీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.

tta mothers flayer.png