అమెరికాలో భారతీయ సంస్కృతి మరోసారి రంగుల హరివిల్లులా మెరిసేందుకు సిద్ధమైంది.టెక్సాస్‌లోని లియాండర్ నగరంలో జూన్ 13, 2026న జరగనున్న “సారీ వాకథాన్ 2026” కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెహఫిల్ మేరిగోల్డ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో “సారీ విత్ స్నీకర్స్” అనే వినూత్న కాన్సెప్ట్‌తో మహిళలు చీరల్లోనే వాక్, జాగ్, రన్ చేయనున్నారు.

ఉదయం 6:30 గంటలకు లేక్వుడ్ పార్క్‌లోని ఓవర్‌లుక్ పావిలియన్ వద్ద ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌లో 3K మరియు 5K రూట్లు ఏర్పాటు చేశారు. అన్ని వయసుల మహిళలకు ఈ కార్యక్రమం అందుబాటులో ఉండగా, ప్రత్యేకంగా మదర్-డాటర్ వాక్ సెగ్మెంట్ ఆకర్షణగా నిలవనుంది.

సాంప్రదాయ చీరకు స్పోర్ట్స్ స్టైల్‌ను జోడిస్తూ నిర్వహిస్తున్న ఈ వాకథాన్‌లో గ్రూప్ ఫోటోలు, ఫన్ అవార్డులు, కల్చరల్ వైబ్స్‌తో సందడి మామూలుగా ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు. మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసానికి ప్రాధాన్యం ఇస్తూ వెల్‌నెస్ స్పీకర్ ప్రత్యేక ప్రసంగం ఇవ్వనున్నారు.

ఈసారి కార్యక్రమాన్ని మరింత భారీ స్థాయిలో నిర్వహించేందుకు వెండర్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించారు. “ఇది కేవలం వాక్ కాదు.. ఒక ఉద్యమం” అంటూ నిర్వాహకులు పిలుపునిస్తున్నారు.