ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకం చేస్తూ, మన సంస్కృతిని, అభివృద్ధిని చాటిచెబుతున్న ప్రతిష్టాత్మక సంస్థ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. ఈ అసోసియేషన్ అమెరికాలోని రాలీ చాప్టర్‌కు నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. సంస్థ గ్లోబల్ లీడర్‌షిప్ మార్గదర్శకత్వంలో ఈ కొత్త టీమ్ బాధ్యతలు స్వీకరించింది.

GTA గ్లోబల్ విభాగంలో వ్యవస్థాపకులు, అడ్వైజరీ చైర్‌గా కలవల విశ్వేశ్వర్, చైర్మన్‌గా ప్రవీణ్ కేసిరెడ్డి, అధ్యక్షులుగా బాపురెడ్డి కేతిరెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా రవీందర్ గడ్డంపల్లి కొనసాగుతున్నారు.

తెలంగాణ సమాజం కోసం ప్రపంచవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యంగా ఈ కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఎంతో ఉత్సాహం, అంకితభావం కలిగిన నాయకులు ఈ జట్టులో ఉండటం సంస్థకు మరింత బలాన్ని చేకూరుస్తుందని సంస్థ వ్యవస్థాపకులు విశ్వేశ్వర్ కలవల భావిస్తున్నారు.

GTA రాలీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు:

  • అధ్యక్షులు (President/PR): శ్రీనివాస్ నాగనబోయిన

  • ప్రెసిడెంట్ ఎలక్ట్ (Membership): రజనీకర్ దాసరి

  • ప్రధాన కార్యదర్శి: రామ్ సుశీల్ పాడూరి

  • కోశాధికారి: శ్రీనాథ్ అమిరెడ్డి

  • జాయింట్ సెక్రటరీ (Sports): వినయ్ చెరుకు

  • మహిళా/NextGen: చైతన్య కొల్లూరి

  • మీడియా/కమ్యూనికేషన్స్: రజిత కోట

  • ఫుడ్ కమిటీ చైర్: మహిపాల్ అల్లూరి

  • కల్చరల్/ఈవెంట్స్: ప్రియాంక ఏటికాల, అనిత మావురాపు

  • లాజిస్టిక్స్: ఉదయ్ కాంత్ మదిక

  • అడ్వైజర్: శేఖర్ నల్లబోతుల

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను రాలీ ప్రాంతంలో మరింత విస్తృతంగా ప్రచారం చేస్తూ, స్థానిక తెలంగాణ కమ్యూనిటీకి అండగా నిలుస్తామని నూతన కార్యవర్గ సభ్యులు ఈ సందర్బంగా ఆశాభావం వ్యక్తం చేశారు.