అమెరికాలోని రాలీ నగరంలో ఆటా (ATA) మెగా కన్వెన్షన్‌కు సంబంధించిన కిక్-ఆఫ్ ఫండ్‌రైజింగ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ఆటా కన్వెన్షన్ నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భారీ విజయాన్ని సాధించింది.
స్థానికంగా ఉన్న ‘కరా మోడ్రన్ ఇండియన్ రెస్టారెంట్’ వేదికగా జరిగిన ఈ వేడుకలో సుమారు 100 మందికి పైగా దాతలు, కమ్యూనిటీ నాయకులు పాల్గొన్నారు. సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ ఈవెంట్‌లో రాలీ తెలుగు కమ్యూనిటీ సభ్యులు మొత్తం $1,75,000 (సుమారు రూ.1.45 కోట్లు) విరాళాలను ప్రకటించడం విశేషం.
ఈ భారీ విరాళాల సేకరణతో బాల్టిమోర్‌లో జరగనున్న మెగా కన్వెన్షన్‌పై తెలుగు ప్రజల్లో ఉన్న ఆసక్తి, ఆదరణ మరోసారి స్పష్టమైంది. కార్యక్రమానికి హాజరైన ప్రతి దాత, స్పాన్సర్, నాయకులకు ఆటా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే కన్వెన్షన్‌ను విజయవంతం చేయడానికి రాలీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆటా టీమ్ పిలుపునిచ్చింది.


















