అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, ప్లానో నగరంలో జరిగిన ఈద్ సెలబ్రేషన్స్ మరో లెవల్‌కి వెళ్లాయి. ఆంధ్ర ముస్లిం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా -AMANA ఆధ్వర్యంలో Crystal Banquet Hall లో గ్రాండ్‌గా నిర్వహించిన ఈద్ మిలాప్ డిన్నర్ (Eid Milaap Dinner) ఫుల్ జోష్‌లో సాగింది.

రంజాన్ అనంతరం ఈద్ ఆనందాన్ని షేర్ చేసుకుంటూ నిర్వహించిన ఈ ఈవెంట్‌లో అమెరికాలోని పలు సంఘాల కమ్యూనిటీ లీడర్స్, ప్రొఫెషనల్స్, ఫ్యామిలీస్ తో కలిసి ఒకే వేదికపై సందడి చేశారు. యూనిటీ, బ్రదర్‌హుడ్, డైవర్సిటీకి అసలు అర్ధం చెప్పిన ఈ గ్యాదరింగ్… మొత్తం వాతావరణాన్ని పాజిటివ్ వైబ్స్‌తో నింపేసింది.

ఇది కేవలం ఫెస్టివ్ డిన్నర్ మాత్రమే కాదు… మతాల మధ్య అండర్‌స్టాండింగ్ పెంచడం, పరస్పర గౌరవాన్ని బలోపేతం చేయడం కూడా ప్రధాన ఉద్దేశ్యం. అమెరికా లాంటి మల్టీకల్చరల్ సొసైటీ లో ఇలాంటి ఈవెంట్స్ ఎంత ముఖ్యమో పాల్గొన్న వారు కూడా స్పష్టంగా చెప్పారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన AMANA టీమ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి.

ఒకే టేబుల్ దగ్గర కూర్చొని భోజనం పంచుకుంటూ, హార్ట్‌ఫుల్ కన్వర్సేషన్స్‌తో “డైవర్సిటీ ఈజ్ యూనిటీ” అనే మెసేజ్‌ను స్ట్రాంగ్‌గా చాటిచెప్పిన ఈ ఈద్ మిలాప్ డిన్నర్ … నిజంగా ఒక మెమరబుల్ నైట్‌గా నిలిచింది.