24876 articles

న్యూఢిల్లీ : యాక్సిస్ బ్యాంక్, ఎస్‌ఎస్‌ఎఐటి భాగస్వామ్యంతో కన్హౌలీలో దేశంలోనే తొలి ఒలింపిక్ ప్రమాణాల ఆర్చరీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాయి. ఇది తూర్పు యుపి, బీహార్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ క్రీడాకారులకు 3 ఏళ్లలో అందుబాటులోకి వస్తుంది. ఏటా 100 మంది రెసిడెంట్, 300 మంది ఇతర అథ్లెట్లకు శిక్షణ ఇస్తారు. విజయ్ ముల్బాగల్ మాట్లాడుతూ, అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడమే లక్ష్యమన్నారు.


అమరావతి: తనపై నమ్మకద్రోహి అంటూ వైసిపి కోటరీ దుష్ప్రచారం చేస్తోందని మాజీ ఎంపి విజయసాయి రెడ్డి ఆరోపించారు. నమ్మకద్రోహినే అయితే ఆనాడే సజ్జల మాదిరిగా కాంగ్రెస్ తో సంధి చేసుకునేవాణ్ణినని అన్నారు. విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిబిఐ, ఇడి ఛార్జిషీట్లలో తన పేరు లేకుండా చేసుకునేవాణ్ణినని, నమ్మకస్తుణ్ని అనే కారణంతో ప్రతి ఛార్జిషీట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తన పేరు చేర్చిందని తెలియజేశారు. ఇప్పుడు వైసిపిలో నంబర్-2 జగన్, నంబర్-1 సజ్జల అని.. జగన్ 16 నెలలు జైల్లో ఉంటే తనను 15 నెలలు జైల్లో పెట్టారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. నమ్మక ద్రోహం తన రక్తంతో ఉంటే, అప్పుడే అప్రూవర్ గా మారేవాడినని, తనకు సంబంధం లేని లిక్కర్ స్కామ్ లోనూ తనను ఎ-5గా చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు.కాకినాడ సిపోర్టు కేసులో తనను ఎ-2 గా చేర్చారని, సకల శాఖల మంత్రి పేరు మాత్రం ఇంతవరకు ఏ ఛార్జిషీట్ లోనూ లేదని మండిపడ్డారు. ఏ కేసులూ లేకుండా ఎలానో కోటరీ నాయకుడికి తెలిసినంత తనకు తెలియదని, తాను ఏనాడు నమ్మక ద్రోహం పనులు చేయలేదని అన్నారు. పార్టీ మారేందుకు సిద్ధమైన ఉత్తరాంధ్ర నేతతో కలిసి కోటరీ నాయకుడు క





14 ఏళ్లకే ఐపిఎల్‌లోకి అడుగుపెట్టి.. తన ఆటతో దేశవ్యాప్తంగా అందరిని కట్టపడేసిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. అంతేకాక.. టీం ఇండియాలో చోటు దక్కించుకున్న అతి చిన్న వయస్కుడిగా కూడా వైభవ్ రికార్డు సృష్టించాడు. అయితే క్రికెట్‌లో తన ఆటతో అభిమానులను సంపాదించుకున్న వైభవ్.. ఇప్పుడు గొప్ప మనసు చాటుకున్నాడు. విద్యార్థులకు సాయం చేసేందుకు అతడు ముందుకొచ్చాడు. ‘‘గొప్ప విషయాలు రాబోతున్నాయి.. అలాగే చూస్తూ ఉండండీ’’ అంటూ శుక్రవారం వైభవ్ తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఏంటా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇవాళ ఉదయం ఓ ప్రకటన చేశాడు. ‘నాకు ఎక్స్ ఫ్లాట్‌ఫామ్ నుంచి వచ్చే ఆదాయాన్ని అవసరమైన విద్యార్థుల చదువుకు వెచ్చించాలని భావిస్తున్నా.అర్హత కలిగిన వారు సంప్రదించగలరు. పాఠశాల, కళాశాలకు సంబంధించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారికి సాయంగా ఉంటా. నాకు తోచినరీతిలో మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా’’ అని వైభవ్ పోస్ట్ పెట్టాడు. దీంతో యువ క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. చిన్న వయసులోనే ఇంతటి గొప్ప ఆలోచన చేసినందుకు అభినందనలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.






దర్శకుడిగా ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు అందించిన లోకేశ్ కనకరాజ్ హీరోగా పరిచయమైన సినిమా ‘డిసి’. ఈ నెల 7న విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సన్‌నెక్ట్స్ వేదికగా సెప్టెంబర్ 4 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ సంస్థ పోస్ట్‌ను పంచుకుంది. అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.


అమరావతి: మనం తీసుకునే ఆహారంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గిరిజనుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో సిఎం పర్యటించారు. గన్నెలలో ఆరోగ్య రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని, సంజీవని పథకం రాష్ట్రానికి ఒక గేమ్ ఛేంజర్ లా మారుతుందని, అందరికీ ఆరోగ్యమని తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతానికి వస్తే కొత్త శక్తి ఉత్సాహం వస్తుందని, ఏజెన్సీ ఏరియాల్లో అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఏజెన్సీలో సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తామని, ఏజెన్సీలోని అన్ని గ్రామాలకు రోడ్లు వేయిస్తామని అన్నారు. ఆ రోజుల్లోనే గిరిజనులకు ఆయుర్వేద వైద్యం అందించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. గిరిజనులకు నీళ్లు ఇస్తాం.. సోలార్ వెలుగులు తీసుకొస్తామని, ఏజెన్సీ ప్రాంతాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రకృతి సేద్యానికి ఏజెన్సీ మారు పేరుగా మారిందని, ప్రకృతి సేద్యాన్ని కాపాడుకుంటే మార్కెట్ లో తిరుగుండదని చంద్రబాబు పేర్కొన్నారు. దక్షిణ భారతదేశ







ఢిల్లీ: భారత రాజ్యంగం ప్రకారం దళితులను అంటరానివారిగా చూడటం నేరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. శుద్ధీకరణ పేరుతో చేసేవన్నీ అంటరానితనానికి మరో పేరు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శుద్ధీకరణ చేసిన వారిపై కేసు నమోదు చేయాలని, శుద్ధీకరణ చేపట్టమంటే ఎస్సి,ఎస్టి చట్టాన్ని ఉల్లంఘించడమేనని సూచించారు. అన్నికులాలకు చెందిన వాడినని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకుంటారని, బిజెపి నేతలు మాత్రం శుద్ధీకరణ పాటిస్తారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆలయాన్ని సందర్శించిన తర్వాత బిజెపి నేతలు శుద్ధీకరణ చేశారని, శుద్ధీకరణ లాంటి కార్యక్రమాలు బిజెపి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేస్తారని మండిపడ్డారు. బిజెపి కొత్త సంస్థాగత నిర్మాణంపై తనకు ఆసక్తి లేదని, బిజెపికి కొత్త సంస్థ వచ్చినా, పాతదే కంటిన్యూ అయినా తేడా ఉండదని అన్నారు. కాంగ్రెస్ పోరాటం వ్యక్తులు, సంస్థాగత మార్పులపై కాదని, భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే తమ పోరాటమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇది ఖర్గే ఒక్కరి సమస్య కాదని, ప్రతీ దళితుడి సమస్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గేకు కాంగ్రెస్ నుంచి పెద్ద సపోర్ట్