24776 articles


నవతెలంగాణ – హైదరాబాద్ :మహిళల హాకీ ప్రపంచకప్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. నిన్న ఆమ్‌స్టెల్‌వీన్‌లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో, షూటౌట్‌లో 3-1 తేడాతో ఆతిథ్య నెదర్లాండ్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది. ఆట 30వ నిమిషంలో యిబీ జాన్సన్ గోల్ చేయడంతో నెదర్లాండ్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, ద్వితీయార్థంలో పుంజుకున్న అర్జెంటీనా 54వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను […] The post హాకీ ప్రపంచకప్ విజేత అర్జెంటీనా appeared first on Navatelangana.

ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ 2026ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. ఆమ్‌స్టల్‌వీన్‌లోని వాగెనర్ స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 1, వరుసగా మూడుసార్లు విజేతగా నిలిచిన నెదర్లాండ్స్ జట్టును ఓడించి, అర్జెంటీనా మూడవసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోరులో.. నిర్ణీత 60 నిమిషాల ఆట ముగిసే సమయానికి స్కోరు 1-1తో సమంగా నిలిచింది. ఆ తర్వాత జరిగిన షూట్-అవుట్‌లో 3-1 తేడాతో నెదర్లాండ్స్ పై అర్జెంటీనా సూపర్ విక్టరీ సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ సంచలన విజయంలో కీలక పాత్ర పోషించిన అర్జెంటీనా గోల్‌కీపర్ క్రిస్టినా కోసెంటీనో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యారు. కాగా, ఉమెన్స్ హాకీ వరల్డ్ లో నెదర్లాండ్స్ తొమ్మిదిసార్లు కప్ సాధించగా.. అర్జెంటీనా మూడుసార్లు విజేతగా నిలిచింది.




నవతెలంగాణ – హైదరాబాద్ :మహిళల ఆసియాకప్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు ఆదివారం థాయ్‌లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్ చానెల్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. తొమ్మిది సార్లు జరిగిన ఆసియాకప్‌లో భారత్ ఏడుసార్లు విజేతగా నిలిచింది. గాయం కారణంగా జెమీమా రోడ్రిగ్స్ దూరమవగా, ప్రతీకా రావల్ జట్టులోకి వచ్చారు. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో హాంకాంగ్‌పై విజయం […] The post ఆసియా కప్.. థాయ్‌లాండ్‌తో భారత్ పోరు appeared first on Navatelangana.





నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్ లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడి అతలాకుతలం చేస్తున్నాయి. భోటే కోశి నదికి ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా సంభవించిన ఈ జల ప్రళయంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 675 మృతదేహాలను వెలికితీయగా, మరో 2,498 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విపత్తు పర్యాటకులపైనా తీవ్ర ప్రభావం చూపింది. […] The post నేపాల్‌లో జల ప్రళయం.. 675కి చేరిన మృతుల సంఖ్య appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని ఆర్మీ వెపన్స్ డిపోపై రష్యా డ్రోన్లతో భీకర దాడి చేసింది. ఈ దాడిలో షెల్స్, మైన్స్ కారణంగా భారీ పేలుళ్లు సంభవించి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 38 మంది మృతి చెందగా, 42 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని నెలల కాలంలో ఇదే అతిపెద్ద దాడిగా పేర్కొన్నారు. The post ఉక్రెయిన్ లో భారీ పేలుళ్లు.. 38 మంది మృతి appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా కొట్టుకుపోయిన ఏడు మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్, కుషినగర్ జిల్లాల నదీ తీరాల్లో తేలుతూ లభ్యమయ్యాయి. నేపాల్ నుంచి భారత్‌లోకి ప్రవహించే గండకీ నదీ మార్గం ద్వారా ఈ మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. లభ్యమైన మృతదేహాలను గుర్తించేందుకు భారత అధికారులు నేపాల్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తును వేగవంతం చేశారు. The post నేపాల్ లో వరదలు.. యూపీకి కొట్టుకొచ్చిన ఐదు మృతదేహాలు appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. అటు రాబోయే రెండు గంటల్లో భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మాన్ తెలిపారు. ఆదిలాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, హైదరాబాద్‌లోనూ అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. The post కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు appeared first on Navatelangana.




మన తెలంగాణ/హైదరాబాద్: స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను, భవిష్యత్తును పణంగా పెట్టిన ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం, వారి కుటుంబాలకు సేవ చేయడం తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు (కేకే) నేతృత్వంలో కమిటీ ప్రతినిధి బృందం శనివారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వేదికగా 13 వేల మందికి పైగా ఉద్యమకారులు, వివిధ జేఏసీలు, ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు, మహిళా ఉద్యమకారులతో నిర్వహించిన విస్తృత స్థాయి సంప్రదింపుల వివరాలను, ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదా, వారు సమర్పించిన ప్రధాన విజ్ఞప్తుల నివేదికను కమిటీ ముఖ్యమంత్రికి సమర్పించి సమగ్రంగా వివరించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎమ్. కోదండరామ్, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్ పాల్గొన్నారు. సమావేశంలో కమిటీ ప్రతినిధులు పలు అంశాలను వివరించిన

ఉత్తరాది పూర్తిగా తమ కైవసం అయిందని, ఇక దక్షిణాది మీద దండయాత్ర మిగిలిందని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంబరపడిపోతున్న సమయంలో, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో జెన్ జీ రోడ్ల మీదికి వచ్చి బీజేపీ ఆశల మీద నీళ్లు చల్లింది. అదే ఉత్తరాదిలో ఇటీవల పలు రాష్ట్రాల్లో జెన్ జీ ఉద్యమం స్పూర్తిగా జెన్ ఆల్ఫా కూడా రోడ్ల మీదికి వచ్చి ఉద్యమాలు మొదలుపెట్టింది. పాఠశాలల్లో పరిస్థితులు బాగాలేవని, కనీస వసతులు కల్పించాలని, సరైన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని, గత మూడు వారాలలో పాఠశాల విద్యార్థులు తరగతి గదుల్లోంచి బయటకొచ్చి ప్రభుత్వ కార్యాలయాలకు ఊరేగింపులు తీసారు. స్కూలు గేట్లకు తాళాలు వేశారు. అధికారుల నుంచి సమాధానం కోరుతూ రోడ్లమీద బైఠాయించారు. వారి డిమాండ్లు చాలా మౌలికమైనవి. వాళ్లకు పాఠాలు సరిగ్గా చెప్పే ఉపాధ్యాయులు కావాలి. తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, రాసుకోవడానికి అవసరమైన బల్లలు, సరైన ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు, వాడటానికి వీలుగా ఉండే మరుగుదొడ్లు ఈ జెన్ ఆల్ఫా కనీస కోర్కెలు. ఇంకొక పాఠశాల వారైతే స్కూలుకు వెళ్లడానికి సరైన రోడ్డు వేయాలని డిమాండ్ చేసారు. ఇవన్నీ గొంతెమ్మ కోర్కెలు కావు కదా. ఆ పిల్లలు అడగక