అమరావతి: ఆంధ్ర రాష్ట్రానికి చెందిన విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.  మల్లా ప్రవీణ్ అనే వ్యక్తి భార్య, కుమార్తె, కుమారుడుకు విషమిచ్చి తాను ఊరేసుకుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.