
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం తుమకూరు ప్రాంతంలో చిక్కనాయకణహళ్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోడెకెరె గేటు సమీపంలో రెండు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తురువికిరి గ్రామానికి చెందిన దావుద్ పాషా, అన్నామ్, చిక్కనాయకణహళ్లి గ్రామానికి చెందిన వివేక్(31), అనిల్(32)గా గుర్తించారు. కియా కారు తురువికిరి నుంచి వెళ్తుండగా వోక్సవాగన్ కారు చిక్కనాయకణహళ్లి నుంచి వస్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నాయి.











