టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున శనివారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. నాగార్జున పుట్టినరోజు కానుకగా ఆయన నటిస్తున్న 100వ చిత్రం ‘#KING100’ గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘మనుషుల్లో రెండు రకాలు.. ఒకటి డబ్బున్న వాళ్లు.. రెండు డబ్బు లేని వాళ్లు’ అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో గ్లింప్స్ అదిరిపోయింది. నాగార్జున మరోసారి అదిరిపోయే లుక్‌లో కనిపించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది. రా.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని కుటుంబం నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది.