
ముంబై: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో సునాయాసంగా గెలవాల్సిన టీమిండియా డ్రాతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. రెండు రోజుల ఆటలో 8 వికెట్లను పడగొట్టడంలో భారత బౌలర్లు విఫలం కావడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు.
సహచరుల్లో ఉత్సాహాన్ని నింపడంలో కెప్టెన్‌గా గిల్ పూర్తిగా తేలిపోయాడని విమర్శించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీలేని లోటు జట్టుపై స్పష్టంగా కనిపించిందన్నాడు. ఒకవేళ కోహ్లీనే ఈ మ్యాచ్‌లో ఉండి ఉంటే భారత్ కచ్చితంగా గెలిచి ఉండేదన్నాడు. సహచరుల్లో ఉత్సాహాన్ని నింపడంలో విరాట్ ఎప్పుడూ ముందుంటాడని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఆ లోటు స్పష్టంగా కనిపించిందని కైఫ్ అభిప్రాయపడ్డాడు.











