నవతెలంగాణ-హైదరాబాద్: మెట్రో రైల్ ఆన్‌లైన్ సేవల్లో శనివారం ఉదయం అంతరాయమేర్పడింది. సెన్సార్లు పనిచేయకపోవడంతో ఆన్‌లైన్ టికెట్లు తీసుకున్న ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో మెట్రోస్టేషన్‌లోకి వచ్చే, బయటకు వెళ్లే గేట్ల వద్ద ప్రయాణికులు క్యూ కట్టారు. ఆన్‌లైన్ సేవలు నిలిచిపోవడంతో అక్కడి సిబ్బంది కూడా చేతులెత్తేశారు.
The post హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం appeared first on Navatelangana.












