
రంగారెడ్డి: మరో అవినీతి అధికారి ఇంటిపై ఎసిబి దాడులు చేసింది. ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్న ఎంఆర్ఒ శ్రీనివాస్ రెడ్డి ఇళ్లల్లో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం పదిహేను చోట్ల ఎసిబి సోదాలు నిర్వహిస్తుంది. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. గతంలో మహేశ్వరం ఎమ్మార్వోగా పనిచేశారు.











