
రెండు టి-20ల సిరీస కోసం టీం ఇండియా శ్రీలంకలో పర్యటిస్తున్న భారత్.. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఆగస్టు 23 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌లోనూ గెలిచి శ్రీలంకను వైట్‌వాష్ చేయాలని టీం ఇండియా భావిస్తోంది. అయితే రెండో టెస్టులో జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన కుల్దీప్ యాదవ్‌పై వేటు పడే అవకాశం ఉంది. తొలి టెస్ట్‌లో కుల్దీప్ 25 ఓవర్లు వేసి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో యువ ఆల్ రౌండర్ సారాంశ్ జైన్‌ని జట్టుోకి తీసుకుంటారని టాక్ వినిపిస్తుంది. సారాంశ్ ఒకవేళ జట్టులోకి వస్తే.. అతడికి ఇది అరంగేట్ర మ్యాచ్ అవుతుంది.











