
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బాచేపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. మహరాష్ట్రలోని లక గ్రామానికి చెందిన అభిజిత్ శంబోజి లొకండే(21) హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. స్వగ్రామంలో నిర్వహించనున్న ఓ విందు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై బయలు దేరాడు.ఈ క్రమంలో రాత్రి 1.30గంటల సమయంలో నిజాంపేట్ మండలం బాచేపల్లి జాతీయ రహదారి వద్దకు చేరుకున్న సమయంలో బైక్ అదుపుతప్పి రోడ్డుపై ఉన్న డివైడర్‌ను బలంగా డీకొంది. ఈ ఘటనలో అభిజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు తండ్రి శంబోజి గణపతిరావు కండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.










