
అమరావతి: డిఎస్సి నియామకాల్లో ప్రభుత్వం తప్పులు చేసిందని వైసిపి ఎమ్మెల్సి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అందుకే మండలిలో చర్చకు రావడం లేదని అన్నారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ.. తాము డిఎస్సిపై విచారణకు డిమాండ్ చేస్తున్నామని, డిఎస్సితో పాటు గ్రూప్-1పై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం గ్రూప్-1 ప్రస్తావన తెస్తున్నారని, గ్రూప్-1 లో తప్పులు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకోవచ్చునని బొత్ససత్యనారాయణ సూచించారు.











