హైదరాబాద్: ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగకుండా గృహలక్ష్మి లక్కీ డ్రా ఎలా ప్రారంభిస్తారని అధికారులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అధికారుల తీరుపై దానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమం మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు. బంజారాహిల్స్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్‌లో గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికకు లక్కీ డ్రా తీశారు.