నేటి ఉరుకుల పరుగుల జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన ముప్పు పొంచి ఉంటుంది. అయితే సరైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామంతో ఇంట్లోనే సహజసిద్ధంగా కొలెస్ట్రాల్‌ను ఎలా అదుపులో ఉంచుకోవచ్చో తెలుసుకుందాం..