
3714 వార్తలు
నవతెలంగాణ-మిరుదొడ్డి: కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం కార్మికులు జెండా ఎగరవేసి మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ, “దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం. 8 గంటల పనిదినం కోసం పోరాడి హక్కులు సాధించుకున్న రోజును స్మరించుకుంటున్నాం” అని అన్నారు. కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని […] The post ధర్మారంలో ఘనంగా మే డే ఉత్సవాలు appeared first on Navatelangana.

నవతెలంగాణ-మిరుదొడ్డి: దుబ్బాకలోని సరస్వతి గ్లోబల్ స్కూల్ పదో తరగతి ఫలితాల్లో వరుసగా 100% ఉత్తీర్ణత సాధించి రికార్డు నెలకొల్పింది. పాఠశాలకు చెందిన ఎనిమిది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి సత్తా చాటారు. నాజ్రీన్ 549, హిందూ 540, చరణ్ 535, సూర్య తేజ 532, నిఖీష 525 హర్షిత్ గౌడ్ 521, స్ఫూర్తి 516, వైష్ణవి 507 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల విజయం పట్ల హర్షం […] The post దుబ్బాకలో సరస్వతి గ్లోబల్ స్కూల్ ప్రభంజనం appeared first on Navatelangana.

నవతెలంగాణ-కంఠేశ్వర్: ప్రపంచవ్యాప్తంగా జరిగే 141 మే డే కార్యక్రమంలో భాగంగా నిజాంబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద ఉదయం మేడే జెండాను సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ఎగురవేసి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక కార్యక్రమం మే డే అని కుల,మత ప్రాంత,జాతి,వివక్షత,విభేదాలు లేకుండా కష్టజీవులందరూ తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడటానికి ప్రతిజ్ఞ దినంగా మేడను నిర్వహించుకుంటారని. […] The post సిపిఐ(ఎం), సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే కార్యక్రమాలు appeared first on Navatelangana.


నవతెలంగాణ-కామారెడ్డి: మాచారెడ్డి మండలం గజ్జ నాయక్ తండాలో గోనె శ్రీలత–శ్రీనివాస్ దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం నిర్వహించుకున్నారు.వారి గృహప్రవేశాన్నినికి అతిథిగా గ్రామ సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ హాజీరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంత ఇల్లు కల సాకారం అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు అందుకొని సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వారి గృహప్రవేశాన్ని పురస్కరించుకొని ఆ […] The post ఇందిరమ్మ లబ్ధిదారులకు నూతన వస్త్రాల పంపిణీ చేసిన సర్పంచ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ-కంఠేశ్వర్: భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య జయంతి సందర్భంగా మే డే స్ఫూర్తితో.. స్థానిక నాందేవ్ వాడలో చలివేంద్రం మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ.. సుందరయ్యప్రారంభించారు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యారంగానికి నిధులను కేటాయించడం లేదని […] The post ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలివేంద్రం appeared first on Navatelangana.
నవతెలంగాణ-రాజన్నసిరిసిల్ల: మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, సిఐటియు, బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ పాల్గొని మాట్లాడారు. నేడు ప్రపంచంలో పొద్దు పొడిచిన నుండి రోజు ముగిసే వరకు ఎన్నో రంగాలలో నేటి ఆధునిక ప్రపంచ లో మనిషి జీవనం సాఫీగా సాగే క్రమంలో, సమాజ అభివృద్ధిలో కార్మికుల శ్రమ దాగి ఉందని అన్నారు. శ్రమ నీ పెట్టుబడిగా […] The post అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలో మున్సిపల్ చైర్ పర్సన్ appeared first on Navatelangana.

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఎల్.ఐ.కె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)’. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్. ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఒటిటి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఈ మే నెల 6వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. సోషల్‌మీడియాలోఈ వివరాలను ప్రకటిస్తూ సదరు ఒటిటి సంస్థ పోస్టర్‌ని విడుదల చేసింది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్యూచరిస్టిక్ లవ్‌స్టోరీని తనదైన శైలీ కామెడీని టచ్ చేస్తూ.. ఈ సినిమాను తరకెక్కించాడు దర్శకుడు విఘ్నేశ్ శివన్. ఎస్.జె సూర్య విలన్‌గా నటించారు.

నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఆర్టిసి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతకింది బానయ్య యూనియన్ జెండా ఎగరవేసారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కార్మిక పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం […] The post సిరిసిల్ల ఆర్టిసి డిపో వద్ద ఘనంగా మేడే వేడుకలు appeared first on Navatelangana.
నవతెలంగాణ-రామారెడ్డి: ఎర్రజెండా అందరికీ అండగా నిలుస్తుందని సిపిఐ(ఎం) గిద్ద పార్టీ శాఖ కార్యదర్శి మొగులయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని గిద్ద, రామారెడ్డి తదితర గ్రామాల్లో మే డే దినోత్సవాన్ని ఎర్రజెండా ఎగరవేసి, అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాబోయే కాలంలో కార్మికులు, కర్షకులు తమ హక్కులు సాధించుకోవాలంటే ఎర్రజెండా ఆధ్వర్యంలో పోరాటాలు చేయవలసిందేనని, భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటంలో ఎర్ర జెండా పాత్ర ఎనలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో జిపి […] The post ఎర్రజెండా అందరికీ అండ appeared first on Navatelangana.

సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని తనిఖీ కోసం టికెట్ స్క్వాడ్ ఆపాడు. అయితే ఒక ప్రయాణికుడి దగ్గర టికెట్ లేకపోవడంతో కేసు పెట్టకుండా ఉండడానికి ప్రయాణికుడి నుండి, కండక్టర్ నుండి రూ.20 వేల లంచం టికెట్ స్క్వాడ్ డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహించి సదరు అధికారిని కండక్టర్ చెప్పుతో కొట్టాడు. ప్రయాణికులు దాడి చేశారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంలో క్లాసెన్ కీలక పాత్ర పోషించాడు. అయితే క్లాసన్ ప్రవర్తనతో మరోసరొ వార్తల్లో నిలిచాడు. అనుమతి లేకుండా తన కుటుంబసభ్యల ఫోటోలు, వీడియోలు తీసినందుకు క్లాసెన్ ఓ ఫ్యాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కానీ, ఇందులో క్లాసెన్ ఫేస్ మాత్రం కనిపించలేదు. ముంబై ఇండియన్స్ పై విజయం తర్వాత ఎస్‌ఆర్‌హచ్ ఆటగాళ్లు తిరిగి హైదరాబాద్‌కి పయనమయ్యారు. ఈ సమయంలో ఓ అభిమాని క్లాసెన్‌ను పలకరించాడు. ‘‘మీరు చాలా బాగా ఆడారు’’ అని అన్నాడు. దీనిపై స్పందించిన క్లాసెన్.. ‘‘థాంక్యూ వెరి మచ్ సర్.. అయితే మీరు దయచేసి ఫోటోలు, వీడియోలు తీయొద్దు. నేను అటు తిరిగితే నా ఫ్యామిలీ ఫోటోలు తీస్తారు. కానీ, అలా చేయొద్దు. మీరు ఆపకపోతే మాత్రం మిమ్మల్ని మట్టికరిపిస్తాను’’ అని వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో అభిమానులు క్లాసెన్‌కు మద్దతుగా నిలిచారు. ప్రైవసీకి భంగం కలిగించొద్దని కామెంట్లు చేశారు.

నల్లగొండ: ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి తొమ్మిది మంది గాయపడిన సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో జరిగింది. వెలిమినేడు గ్రామ శివారులో నోష్ ఫార్మా కంపెనీలోని మూడో బ్లాక్‌లో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో తొమ్మది మంది తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గతంలో ఏప్రిల్ 9న కూడా ఈ కర్మాగారంలోనే పేలుడు జరగడంతో ఇద్దరు కార్మికులు గాయపడిన విషయం తెలిసిందే.

అమరావతి: రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రిపగలు కష్టపడుతున్నామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని పునర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని అన్నారు. పమిడిముక్కల ప్రజావేదిక ప్రాంగణంలో స్టాళ్లు పరిశీలించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో ‘పేదల సేవ’ లో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కు పునర్ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చామని, పేదల రుణం తీర్చుకునేందుకు కష్టపడుతున్నామని తెలియజేశారు. టిడిపి గుర్తులో నాగలి, కార్మికుడు, గుడిసెను దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ ఉంచారని, శుభసూచకానికి గుర్తు పసుపు ఆ రంగును పార్టీ జెండాలో ఉంచారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల సంతోషాన్ని చూసి తన కష్టాన్నిమరచిపోతున్నానని, పింఛన్ల కోసం ఏటా రూ. 33 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని అన్నారు. పింఛన్ల పంపిణీని భారంగా భావించట్లేదని, బాధ్యతగా భావిస్తున్నానని, దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వట్లేదని చెప్పారు. కార్మికుల కోసం లేబర్ అడ్డా నిర్మాణాలు చేపడుతున్నామని, లేబర్ అడ్డాలు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా మారాలని అధికారులకు సూచించారు. అత్యాధునిక పనిముట్లతో తొలిదశలో 15

కరీంనగర్: హుస్నాబాద్ ఆర్ టిసి బస్ డిపో లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్టీసీ కార్మికులతో కలిసి మే డే వేడుకలను మంత్రి పొన్నం ప్రభాకర్ జరుపుకోవడం జరిగింది. మే డే వేడుకల్లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్ టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ కి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించడం జరిగింది. నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా యావత్ తెలంగాణ కార్మికులకు, శ్రమైక జీవులు, తెలంగాణ ఆర్టీసీ కార్మికులందరికీ పొన్నం కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో ఆర్ టిసి సిబ్బంది హక్కుల సాధనకు ఐక్యంగా ఉంటూ ప్రభుత్వ సానుకూలత ను వినియోగించుకుంటూ ఎదగాలని రవాణా శాఖ పేద ప్రజలకు లైఫ్ లైన్ గా ఉండాలని కార్మికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఆర్టీసీ ఈడి సోలమన్, కౌన్సిలర్ లు , ఆర్టీఏ మెంబర్ సూర్య వర్మ ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు, ఏసిపి సదానందం, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

హైదరాబాద్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.993 పెంచామని చమురు సంస్థలు తెలిపాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.3,071 హైదరాబాద్ లో రూ.3315 కు చేరింది, ఎల్ పిజి సిలిండర్ ధరల్లో మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం నడుస్తుండడంతో హర్మూజ్ జలసంధిలో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్ లో మూడు సార్లు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. మార్చిలో రూ.144, ఏప్రిల్ లో రూ.195, ఇప్పుడ ఏకంగా రూ.993 పెంచడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. మూడు వేల రూపాయలు పెట్టి సిలిండర్ తీసుకోవడం కంటే హోటళ్లు, రెస్టారెంట్లు మూసుకోని కూర్చోవడం బెటర్ అని యజమానులు వాపోతున్నారు. పెట్రోల్, డీజిల్ లో మార్పులు లేవు.

హైదరాబాద్: ఎన్నికలు అయిపోగానే సిలిండర్, పెట్రోల్ ధరలు పెంచడం ప్రధాని నరేంద్ర మోడీకి అలవాటు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. హోటల్ కార్మికులకు ప్రధాని ఇచ్చిన మేడే గిఫ్ట్ ఇది అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 80 ఏళ్లల్లో ఎప్పుడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచారని, రూపాయి విలువ పాతాళానికి, సిలిండర్ ధరలు ఆకాశానికి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని, సిగాచి ఫ్యాక్టరీలో కార్మికులు చనిపోతే ఇప్పటి వరకు పరిహారం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు దాన వీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ అని ఎద్దేవా చేశారు. జేమ్స్ బాండ్ లెక్క బాండు పేపర్లు ఎందుకు రాశారు? అని కెటిఆర్ ప్రశ్నించారు. హామీలపై అడిగితే బూతులు తిడుతారని, కార్మికులు అంటే సిఎం రేవంత్ రెడ్డికి లెక్కలేదని మండిపడ్డారు. హోటల్ కార్మికుల నడ్డి విరిచేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని, తాను ఎంతో మంది సిఎం లను చూశానని, ఆ సిఎంలకు రేవంత్ కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని దుయ్యబట్టారు. కరోనా సమయంలో కార్మికులను అప్పటి మాజీ సిఎం కెసిఆర్ ప్ర

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తదుపరి మూవీ అప్‌డేట్ వచ్చేసింది. విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివతో బాలకృష్ణ తదుపరి చిత్రంలో నటించనున్నారు. ‘ఎన్‌బికె112’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కొరటాల శివ మార్క్ సామాజిక సందేశంతో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ‘‘అధికారానికి ఉద్దేశం తోడైతే.. అది ఉద్యమంగా మారుతుంది’’ అనే పవర్‌ఫుల్ కొటేషన్‌తో ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘ఎన్‌బికె111’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారని టాక్. ‘వీరసింహారెడ్డి’ వంటి పవర్‌ఫుల్ సినిమా తర్వాత బాలకృష్ణ, గోపిచంద్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. The Stars Align ✨A Festival Awaits 💥💥#NBKxKoratalaSiva ❤🔥#NBK112 pic.twitter.com/PiBfFRWSeV— Yuvasud