మేడ్చల్‌లో ఓ యువతిపై ప్రేమ పేరుతో మోసం చేసి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన సాధనాల సంతోష్‌కుమార్ యువతిపై అత్యాచారం చేసి, ఆమె నగ్న వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదుతో తొలుత జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, కేసును మేడ్చల్ పోలీసులకు బదిలీ చేశారు. దర్యాప్తులో భాగంగా బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసి, వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడు ఉపయోగించిన మొబైల్ ఫోన్, రెండు ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

శనివారం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. యువతులు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.