న్యూయార్క్: అమెరికాలోని వర్జీనియాలో బస్సు బీభత్సం సృష్టించింది. స్టాఫ్ ఫోర్డ్ కౌంటీలోని 95 ఇంటర్ స్టేట్ లో వాహనాలపైకి బస్సు దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 34 మందికి గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతులలో ఏడేళ్ల బాలుడు, 13 ఏళ్ల బాలిక, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. బస్సు డ్రైవర్ జింగ్ జాంగ్(48)ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వాణిజ్య వాహన డ్రైవర్లకు ఆంగ్లం మాట్లాడటం తప్పనిసరి కానీ డాంగ్‌కు ఇంగ్లీష్ భాష రాదని రవాణా శాఖ అధికారి సీన్ డిఫీ తెలిపారు.