ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా యువత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సూర్యపేట జిల్లా అభివృద్ధికి యువత పారిశ్రామిక రంగంలో రాణించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్లు, ప్రోత్సాహక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాపార నిర్వహణపై యువతకు అవగాహన కల్పించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. విజయాలు, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని సమర్థ వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు. పరిశ్రమల స్థాపనకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సహకరిస్తుందని కలెక్టర్ తెలిపారు.