
హైదరాబాద్: మాజీ మంత్రి, వైసిపి నాయకుడు ముద్రగడ పద్మనాభం(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మరణించారు. దీంతో పలువురు రాజకీయ నాయకులు ముద్రగడ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, 1953 జనవరి 22న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం జన్మించారు. 1977లో రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ.. జనతా పార్టీ నుంచి 1978లో తొలిసారి ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా పోటి చేసి గెలుపొందారు. తర్వాత 1982లో టిడిపి చేరి.. 1983, 1985, 1989 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక, సీనియర్ ఎన్టీఆర్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా ముద్రగడ పనిచేశారు.













