
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 10 ఆధిక్యంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 258 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ 76 (నాటౌట్) జట్టును ఆదుకున్నాడు. ఓపెనర్ బెన్ డకెట్ (43), లియామ్ డాసన్ (68) తమవంతు సహకారం అందించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 45.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (80) రిటైర్డ్‌హర్ట్ జట్టును ఆదుకున్నాడు. శ్రేయస్ (35), సుందర్ 52 (నాటౌట్), అక్షర్ 57 (నాటౌట్) మెరుగైన ఆటతో జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు.












