
వాషింగ్టన్ డిసి: అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలకు గుర్తుగా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రంతో సరికొత్త నాణేలను ముద్రించే ప్రక్రియను యూఎస్ టంకశాల (మింట్) ప్రారంభించింది. అమెరికా స్వేచ్ఛా స్వాతంత్ర్యలు, శాశ్వత వారసత్వానికి చిహ్నంగా నిలిచేలా సరికొత్త బంగారు నాణేన్ని ముద్రించనుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఈ మేరకు 1 డాలర్ బంగారు నాణెం ఫస్ట్‌లుక్‌ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.













