
ముంబై: కెరీర్ ఆరంభంలో తనను కేవలం టెస్టు క్రికెటర్‌గానే భావించే వారని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అవకాశం ఇచ్చే వారు కాదని భారత స్టార్ ఆటగాడు కెఎల్ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. జియో హాట్‌స్టార్ నిర్వహించిన సూపర్‌స్టార్స్ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు.
కెరీర్ ప్రారంభించిన కొత్తలో బిసిసిఐ తనను కేవలం టెస్టులకు పరిమితం చేసిందన్నాడు. వన్డేలు, టి20లలో అవకాశాలు లభించేవి కావన్నాడు. అయితే ఐపిఎల్‌లో రాణించడం ద్వారా తన సత్తా ఏంటో బిసిసిఐకి చాటానని రాహుల్ వెల్లడించాడు. ఆ తర్వాతే తనకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్థానం లభించిందన్నాడు. ఇక అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించానని రాహుల్ పేర్కొన్నాడు.










