తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నానని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్)కు సిఇసి ఆమోదం తెలిపిందని ఆమె ఎక్స్ వేదిగా ప్రకటించారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం తాను చేసిన కృషిని కొనసాగిస్తూ, ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పని చేస్తానని తెలిపారు.

జనవరి 2026లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నామని, అందులో మూడవ ప్రాధాన్యతగా తాము ఇచ్చిన పేరును ఇసి ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం అని పేర్కొన్నారు. “టీఆర్‌ఎస్ నాకు రాసిపెట్టి ఉందేమో” అంటూ ట్వీట్ చేశారు.