
తిరుపతి: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. శనివారం శ్రీవారిని 80,350 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,597 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.27 కోట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు.










