
మన తెలంగాణ/బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలోని లిఫ్టులో శనివారం ఓ వింత జంతువు ప్రత్యక్షం కావడంలో సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సంఘట స్థలానికి చేరుకున్న అధికారులు పిల్లి జాతికి చెందిన జంతువుగా నిర్ధారించారు. బకెట్ సహాయంతో తీసి బయటకు పంపించారు. ఈ జంతువు పునుగుపిల్లి మాదిరిగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.










