దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ముఖ్యంగా, రూ.449 ధరలో అందుబాటులో ఉన్న ప్లాన్‌లు ధర పరంగా ఒకేలా కనిపించినప్పటికీ, అందించే ప్రయోజనాల్లో గణనీయమైన తేడా ఉంది. మరి ఈ రెండు ప్లాన్‌లలో ఏది ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుందో చూద్దాం.


జియో రూ.449 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో రూ.449 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో నెలకు 75GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. డేటా పరిమితి పూర్తైన తర్వాత ప్రతి GBకు రూ.10 చొప్పున ఛార్జ్ చేస్తారు. ఇది ఫ్యామిలీ ప్లాన్ కావడంతో ప్రధాన సిమ్‌తో పాటు మరో మూడు అదనపు ఫ్యామిలీ సిమ్‌లు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి అదనపు సిమ్‌కు కూడా నెలవారీ 5జీ డేటా ప్రయోజనం లభిస్తుంది.

ఈ ప్లాన్‌లో లభించే ఇతర ప్రయోజనాలు:

1. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్

2.రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు

3. 3 నెలల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ ప్లస్ యాక్సెస్

4. 50GB జియో క్లౌడ్ స్టోరేజ్

5. 18 నెలల పాటు గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్

6. 5000GB గూగుల్ క్లౌడ్ స్టోరేజ్

7. నానో బనానా సేవలు

8. జియో 5జీ నెట్‌వర్క్‌లో 5జీ మొబైల్‌కు అన్‌లిమిటెడ్ 5జీ డేటా


ఎయిర్‌టెల్ రూ.449 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.449 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో ఈ కింది ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

1. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్

2. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు

3. అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ డేటా

4. 5జీ స్లైసింగ్ ద్వారా ఫాస్ట్ లేన్ టెక్నాలజీ

5. గూగుల్ వన్ ద్వారా 100GB క్లౌడ్ స్టోరేజ్

6.ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం యాక్సెస్

7. 12 నెలల పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం

8. ఫ్రాడ్ లింక్ బ్లాకింగ్

9. ఉచిత హెలోట్యూన్ సేవ

అయితే ఇది సింగిల్ సిమ్ ప్లాన్ మాత్రమే. జియో ప్లాన్‌లో ఉన్నట్లుగా ఫ్యామిలీ సిమ్ ప్రయోజనాలు ఇందులో ఉండవు.


ఏ ప్లాన్‌ బెస్ట్?

ఒకే ప్లాన్‌లో కుటుంబ సభ్యులకు అదనపు సిమ్‌లు, క్లౌడ్ స్టోరేజ్, ఓటీటీ ప్రయోజనాలు కోరుకునే వారికి జియో రూ.449 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మంచి ఎంపికగా చెప్పవచ్చు. మరోవైపు అన్‌లిమిటెడ్ డేటా, 5జీ స్లైసింగ్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం వంటి అదనపు సేవలు కావాలనుకునే సింగిల్ యూజర్లకు ఎయిర్‌టెల్ రూ.449 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.


ఈ విషయం గుర్తించుకోండి

రెండు ప్లాన్ల కొనుగోలుపై 18 శాతం జీఎస్‌టీ అదనంగా వర్తిస్తుంది. దీంతో ప్లాన్ తుది ధర సుమారు రూ.529.82 అవుతుంది.