
మేడ్చల్ మల్కాజ్ గిరి: కుత్బుల్లాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు,మాజీ డిసిసి అధ్యక్షులు, కెఎం, ప్రతాప్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మంగళవారం అర్ధరాత్రి ఉన్నట్టు ఉండి అనారోగ్యానికి గురి కావడంతో చింతల్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రతాప్ కు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఊపిరి అడక ఇబ్బంది పడుతున్నాడని వైద్యులు తెలిపారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతునట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు వెంటనే దుబాయ్ నుండి నగరానికి చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితి పై వైద్యులతో మాట్లాడారు. మేరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.










