మిథున మాస పూజల నిమిత్తం కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయం నేటి (జూన్ 14) నుంచి భక్తుల దర్శనార్థం పునఃప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తంత్రీ కందరారు మహేష్ మోహనారు సమక్షంలో నేడు సాయంత్రం 5 గంటలకు మేళ్‌శాంతి ఈ.డి. ప్రసాద్ గర్భగుడి తలుపులు తెరిచి, ఆలయ సంప్రదాయం ప్రకారం దీపారాధన నిర్వహిస్తారు. ఈ నెలవారీ ప్రత్యేక పూజలు జూన్ 19 వరకు కొనసాగనున్నాయి. స్వామివారి దర్శనం కోరుకునే భక్తుల సౌకర్యార్థం www.sabarimalaonline.org వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో వర్చువల్ క్యూ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులు తమ స్లాట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. జూన్ 19వ తేదీ రాత్రి ప్రత్యేక పూజలు ముగిసిన అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు.